యోగాతో మానసిక శక్తి వృద్ది చెందుతుంది

*సీనియర్ మెడికల్ ఆఫిసర్ డాక్టర్ రుక్సాన అన్వర్
*తూప్రాన్ లో ఆయుష్, విశ్వ ఆయుర్వేద పరిషత్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర
తూప్రాన్( జనంసాక్షి )జూన్ 18::
ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం యోగా చేయడం వల్ల మందులు లేకుండా మానసిక ఉల్లాసం తో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవిస్తారని సీనియర్ మెడికల్ అపిసర్ డాక్టర్ రుక్సాన అన్వర్ తెలిపారు. శనివారం ఉదయం తూప్రాన్ లోని ఆయుర్వేద ఆసుపత్రి నుండి నర్సపూర్ చౌరస్తా వరకు పాదయాత్ర (వాకింగ్) నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగా ఒక అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్వ ఆయుర్వేద పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షుడు లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు ప్రజల ఆరోగ్య దిశగా అడుగులు వేయడం వల్ల మందులు లేకుండా జీవించే యోగం కేవలం యోగాభ్యాసం మూలంగా సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అనంతరం లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్ మాట్లాడుతూ యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం అని వివరంచారు. ఇది అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం అని, మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది అని తెలిపారు. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు.  ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుందని అన్నారు. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సీనియర్ ఆపిసర్ డాక్టర్ రుక్సాన అన్వర్, విశ్వ ఆయుర్వేద పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షుడు లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మమ్మద్ హమ్మడ్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్, డాక్టర్ విజిత, డాక్టర్ లక్ష్మినారాయణ, డాక్టర్ అవంతి, డాక్టర్ రాజ్ మోహన్, డాక్టర్ తేజస్విని, డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ బషీర్ ఉన్నీసా బేగం, డాక్టర్ సబిత, డాక్టర్ రజినీ, డాక్టర్ విజేత, డాక్టర్ లావణ్య, డాక్టర్ ప్రవీణ్ కుమార్, తూప్రాన్ ఫార్మసీస్ట్ వెంకటేశ్వర్లు గౌడ్, జూనియర్ అసిస్టెంట్ సురేష్, పిటీ ఎస్ విజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.