రండి ఈ దారుణ మారణకాండను ఆపుదాం!
బుద్దం శరణం గచ్చామి.. ఒకరికి సాయం చేయకున్నా పర్వాలేదు..కానీ ఎవరికీ నష్టం చేయవద్దు.. ఇవి దలైలామా తరుచూ భోదించే మాటలు..కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు..మానవ హకుక్ల కోసం ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించిన అతి పెద్ద ఉద్యమకారులు అంగ్‌సాన్ సూకీ ఉండేది అక్కడే…కానీ ఇవేవి, వీళ్లేవరూ బర్మాలో జరుగుతున్న అతిపెద్ద మానవహననాన్ని ఆపలేకపోయారు. వందలు, వేల మందిని ఊచకోస్తుంటే వీరు ఏమయ్యారో అర్థం కాలేదు…కులం, మతం, గోత్రం పక్కన పెడితే వారంతా మనుషులే కదా..అలాంటి మారణకాండ ఎక్కడ జరిగినా సాటి మనుషులుగా మనం కనీసం స్పందించాలి కదా..ప్రపంచానికి పెద్ద పోలీసుగా ఫోజులు కొట్టే అమెరికా గొంతు ఇపుడెందుకు మూగపోయింది. తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి, తమ అవసరాలు తీర్చుకోడానికి సమృద్దిగా వనరులు ఉన్న చిన్న చిన్న దేశాలలో అంతర్యుద్దా లు సృష్టించి ఆ దేశంలో పాగా వేసే ప్రపంచ పోలీసుకు, ముస్లింలు అంటే చాలు అనుమానపు చూపులు చూసే అంకుల్ శామ్‌కు మానవ హక్కుల హననం గురించి పట్టించుకొనే తీరికెక్కడిది. వరదలు, అంతర్గత యుద్దాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు హుటాహుటిన స్పందించే ఐక్యరాజ్యసమితి ఇపుడు ఎందుకనో స్పందించడం లేదు. బోరుబావిలో బాలుడు పడ్డడని, 24 గంటలు..36 గంటలు హడావుడి చేసే టీవీ చానళ్ల గొంతు ఎందుకనో మూగబోయింది. సెలెబ్రిటీ వార్తలతో రంగురంగుల పేజీలలో అందింస్తూ, కట్టుకథలతో కాలం వెల్లదీసే పత్రికలకు ఈ దారుణ మానవ కాండ కానరావడం లేదు..మయన్మార్‌లో ఈ మానవహననంలో చనిపోతున్న వారిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ పూర్వపు భారత పౌరులే. అయినప్పటికీ ఇపుడు ఏ దేశానికి చెందని పౌరులే. కానీ మనిషి వికృత చేష్టలకు గజగజ వణికిపోతూ లెక్కలేనన్ని కాలరాత్రులు గడుపుడుతున్న అక్కడి ప్రజలకు మానవత్వం అనేది ఈ ప్రపంచంలో ఇంకా బతికే ఉందన్న భరోసాను మనం కల్పించగలగాలి.రండి..గొంతెత్తి నినదిద్దాం..మయన్మార్‌లో దారుణ మారణ కాండను నిరసిద్దాం..పూర్వపు భారత పౌరులై ఉండి ఇపుడు దారుణ మారణ కాండలో బలవుతున్న మయన్మార్ ముస్లింలను కాపాడదాం..వీరిని కాపాడటానికి భారత్ ప్రభుత్వం కూడా స్పందించాలి. మయన్మార్‌కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలి. అక్కడ జరుగుతున్న మానవహననంపై ప్రపంచం స్పందించాలి. అక్కడి మానవహక్కుల ఉల్లంఘనలపై స్వచ్చంద సంస్థలు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఆ మారుణ కాండను వ్యతిరేకించని వారు మానవత్వం ఉన్న మనుషులే కారు..