రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత యూత్ సభ్యులు.
బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత యూత్ సభ్యులు మణుగూరు ప్రభుత్వ100 పడకల హాస్పటల్ నందు వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో రక్తం దానం చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు బూర్గంపహాడ్ మండలం నుండి యువత పెద్ద ఎత్తున పాల్గొని స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రక్తదానం చేశారన్నారు. మండలం నుంచి సుధాకర్, ప్రసాద్, విష్ణు, నరేంద్ర, వెంకట్, నవీన్, గణేష్ లు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులను ఎమ్మెల్యే రేగా కాంతారావు అభినందించారు.