రఘనందన్‌కు పార్టీలో అన్ని పదువులు కల్పించాం: తెరాస
హైదరాబాద్ : తెరాస నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌కు పార్టీలో అంచెలంచెలుగా అన్ని పదవులు కల్పించామని తెరాస మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి రాజయ్య అన్నారు. పార్టీ తరపున ఉద్యమాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తే రఘునందన్ రాను పొమ్మన్నారని అన్నారని తెలిపారు. పదవుల కోసమే తప్ప పార్టీ కార్యక్రమాల్లో ఎనాడైనా పాల్గొన్నవా? అని ఆయన రఘునందన్‌ను ప్రశ్నించారు.