రతన్.. టాటా మిస్త్రీ ..వెల్‌కం
న్యూఢిల్లీ, డిసెంబర్ 28 (జనంసాక్షి): ‘టాటా’లో నూతన అధ్యాయం ఆరంభం. టాటా గ్రూపు చైర్మన్‌గా శుక్రవారంనాడు సైరస్‌మిస్త్రీ వారసత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రతన్‌టాటా 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నందున.. పదవీ విరమణ చేయనున్నారు. జంషెడ్జీ నసిర్‌వాంజి ‘టాటా’ వ్యవస్థాపకుడు. ఆయన 1939, మార్చి 3న జన్మించారు.1904, మే 19న మరణించారు. జహంగీర్ రతన్‌జి దాదాభాయి టాటా (జెఆర్‌డి టాటా) 1904, జులై 29న జన్మించారు. 1993, నవంబరు 29న మరణించారు.
రతన్‌టాటా.. 1937, డిసెంబరు 28న జన్మించారు. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిం చారు. 1991లో టాటా గ్రూపు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2008లో లక్ష రూపాయలకే నానో కారు ఉత్పత్తి చేశారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఉన్న 10వేల రూపాయల టర్నోవర్‌ను 2011-12 నాటికి 4,75,721 కోట్ల రూపాయలకు చేర్చారు. 120ఏళ్ల చరిత్ర ఉన్న టాటాల సామ్రాజ్యాన్ని పాలించి శాసించిన ముగ్గురు యోధులు టాటా వంశీకులే. తొలిసారిగా మరో వంశానికి చెందిన సైరస్ పల్లోంజి మిస్త్రీ టాటా గ్రూపు పీఠాన్ని అధిష్టిస్తున్నారు. మిస్త్రీ.. 1968, జులై 4వ తేదీన జన్మించారు. టాటా సన్స్, టాటా ఎలెక్సీ, పలు కంపెనీల్లో బోర్డుల్లో డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.