రపటి నుంచి పైకా మండల స్థాయి క్రడా పోటీలు

మంథని : పట్టణం కళాశాల మైదానంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పైకా క్రీడా పోటీలు సిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీదర్‌ తెలిపారు. ఐదవ తేదీన బాలికలకు, అరవ తేదీన బాలురకు కబడ్డీ,కోకో, వాలీబాల్‌ పోటీలు, ఏడవ తేదీన బాలబాలికలకు అథ్లెటిక్‌ పోటీలు జరుగుతాయని పేర్కోన్నారు. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు బ్లాక్‌ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గోనాల్సి ఉంటుందని అయన వివరించారు.