రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్లక్ష్యం
ప్రమాదంలో యూరప్ దేశాలు..
అనుప్రమాదం ఉంటుందన్న ఆందోళనలు
యూరప్ భద్రతకు ప్రమాదం ఏర్పడిరదన్న బ్రిటన్
లండబన్,మార్చి4(జనం సాక్షిజనం సాక్షి):రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్లక్ష్యం కారణంగా మొత్తం యూరప్ అభద్రతలో పడిరదని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్ భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు కలిగిస్తున్నాడని అన్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా చూసేందుకు బ్రిటన్ అన్ని విధాలా ప్రయత్నిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని తాను డిమాండ్ చేస్తానని.. బ్రిటన్ తక్షణమే రష్యా సన్నిహిత మిత్రదేశాలతో ఈ సమస్యను తీసుకుంటుందని బ్రిటన్ ప్రధాని చెప్పారు. ఉక్రెయిన్‌లోని అణు కర్మాగారంలో కాల్పుల ఘటన తర్వాత బ్రిటన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. యూరోప్‌లోని అతిపెద్ద జపోరిజ్జియా అణు విద్యుత్ ఎª`లాంట్ , పరిసర ప్రాంతాన్ని ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయమై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తీవ్ర ప్రమాదాన్ని హెచ్చరించింది. అదే సమయంలో,
మేము పరిస్థితి గురించి ఉక్రెయిన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని .. అణు విద్యుత్ ప్లాంట్ పై షెల్లింగ్ నివేదికల గురించి కూడా తెలుసునని ఎంఇం తెలిపింది. ఉక్రెయిన్‌లోని అణు రియాక్టర్లను ఢీకొంటే తీవ్ర ప్రమాదం తప్పదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ హెచ్చరించింది. ఎంఇం డైరెక్టర్`జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సీ ఉక్రేనియన్ ప్రధాన మంత్రి డెనిస్ శ్యాగల్ , ఉక్రేనియన్ న్యూక్లియర్ రెగ్యులేటర్ , ఆపరేటర్‌తో అణు విద్యుత్ ఎª`లాంట్‌లోని భయంకరమైన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. ఎంఇం కూడా బలప్రయోగాన్ని ఆపాలని రష్యా సైన్యానికి విజ్ఞప్తి చేసింది. యూరప్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రమైన జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న ప్రాంతాన్ని రష్యా సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ట్వీట్ చేసింది . ఎంఇం పరిస్థితి గురించి ఉక్రేనియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. అణు విద్యుత్ ప్లాంట్ పై షెల్లింగ్ లోని పరిస్థితిపై చర్చలు జరుపుతోంది. అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా సైన్యం కాల్పులు.. పేలితే చెర్నోబిల్ కంటే 10 రెట్లు అధిక ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ఎª`లాంట్ అయిన జపోరిజియా ఎన్‌పిపిపై రష్యా దళాలు అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ వివరాలను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా వెల్లడిరచారు. ప్లాంట్ ఇప్పటికే మంటల్లో చిక్కుకుందని తెలిపారు. అది పేలినట్లయితే, అది చెర్నోబిల్ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంటుందని హెచ్చరించారు.