రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

noble-prize
న్యూయార్క్‌,అక్టోబర్‌ 5(జనంసాక్షి):2016రసాయన శాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్‌ బహుమతి దక్కింది. అతి సూక్ష్మ యంత్రాలను అభివృద్ధి చేసినందుకు గాను జీన్‌ పెర్రీ సావేజ్‌, సర్‌ జే ఫ్రేజర్‌ స్టొడార్ట్‌, బెర్నార్డ్‌ ఫెరింగాలు ఈ ఏడాది నోబెల్‌ను గెలుచుకున్నారు. ఈ ముగ్గురూ మానవ శరీరంలోని పరమాణువు యంత్రాలను డిజైన్‌ చేశారు. స్వీడన్‌లో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నోబెల్‌ కమిటీ ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పేర్లను వెల్లడించింది. శరీరంలోని సూక్ష్మ యంత్రాలను రూపొందించిన ఈ ముగ్గురూ రసాయనిక శాస్త్రాన్ని అభివృద్ధి చేశారని రాయల్‌ స్వీడిష్‌ అకాడవిూ అభిప్రాయపడింది.పారిస్‌ కు చెందిన  ప్రొఫెసర్‌ జీన్‌ పెర్రీ సావేజ్‌ .. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ స్ట్రాట్స్‌బర్గ్‌లో పనిచేస్తున్నారు. ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసర్చ్‌ డైరక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్‌ కు చెందిన సర్‌ ఫ్రేజర్‌ స్టొడార్ట్‌  అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. నెదర్లాండ్స్‌లో జన్మించిన శాస్త్రవేత్త బెర్నార్డ్‌ ఫెరింగా?యూనివర్సిటీ ఆఫ్‌ గ్రోనింజన్‌లో ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.