రాందేవ్‌ బాబా ఆందోళనను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : అవినీతికి వ్యతిరేకంగా రాందేవ్‌బాబా ఆధ్వర్యంలో అగస్టు 9న ఢిల్లీలో చేపడుతున్న ఆందోళన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు అయి విజయవంతం చేయాలని జిల్లా ఆందోళన సమితి అధ్యక్షుడు విజయకుమార్‌ విజ్ఞప్తి చేశారు. విదేశి బ్యాంకుల్లో నల్లధనం, అవినీతిపై రాందేవ్‌బాబా చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని ఆయన కోరారు. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న అవినీతి, అక్రమాల వల్ల ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్న బాబా కార్యక్రమంలో ప్రజలు పాలు పంచుకోవాలని ఆయన కోరారు.