రాంపూర్ గ్రామ వాసికి డాక్టరేట్ ప్రదానం

చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 02 : ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తత్వ శాస్త్రం విభాగంలో మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన డాక్టర్”బందారం వెంకటేశ్వర్లు గౌడ్ కు పిహెచ్ డి పట్టా లభించింది. తత్వ శాస్త్రంలో ద ఒరిజిన్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ యోగ అనే అంశంపై వెంకటేశ్వర్లు పరిశోధన చేసి సిద్ధాంత గ్రంధాన్ని తత్వ శాస్త్రం విభాగ అధిపతి ప్రొఫెసర్ వంశీధర్ కు అందజేశారు. ప్రొఫెసర్ టి. కృష్ణారావు ఆధ్వర్యంలో పరిశోదన చేశారు. నిపుణుల కమిటీ ఈ గ్రంధాన్ని పరిశీలించి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్ డీ అవార్డుకు సిఫారసు చేసింది. ప్రొఫెసర్ టి. కృష్ణారావు ప్రస్తుత టీజేఏసీ చైర్మన్ పర్యవేక్షణలో ఈ పరిశోధన చేశారు. తత్వశాస్త్రం అధిపతి ప్రొఫెసర్ టి.కృష్ణారావు అవార్డుకు సంబంధించిన పీహెచ్ డి డిగ్రీ నోటిఫికేషన్ పట్టాను వెంకటేశ్వర్లు గౌడ్ కు శనివారం అందజేశారు. తాను డాక్టరేట్ పొందడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు,ప్రొఫెసర్ లకు, గైడ్ కు వెంకటేశ్వర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాంపూర్ గ్రామంలోని రెండవ వ్యక్తిగా పీహెచ్ డి పట్టా పొందిన డాక్టర్” వెంకటేశ్వర్లు ను పలువురు అధ్యాపకులు, అధికారులు, విద్యార్థి నాయకులు గ్రామ ప్రజలు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు