రాజధానిలో నిర్మాణాలు వేగవంతం
క్షేత్రస్థాయి పరిశీలన చేసిన మంత్రి
అమరావతి,జూలై25(జనంసాక్షి): ఆంధప్రదేశ్ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న రోడ్ల పురోగతిని మంత్రి పరిశీలించారు. మరింత వేగంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ విూడియాతో మాట్లాడుతూ.. ఆల్ ఇండియా సర్వీసెస్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. డిసెంబర్ 31 నాటికి క్వార్టర్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. రాజధానిలో ఇటుక పడలేదని విమర్శలు అర్ధరహితమని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఇదిలావుంటే రాజధాని అమరావతిలో ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటించింది. రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు తెలుసుకొనేందుకు వచ్చిన బృందం వెంకటపాలెం నర్సరీని సందర్శించింది. ఎటువంటి మొక్కలు పెంచుతున్నారో అడిగి తెలుసుకొన్నారు. కూలీలతోనూ ముచ్చటించారు. తర్వాత రాజధాని ప్రతిపాదిత గ్రామమైన వెంకటపాలెంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకొన్నారు. ఎర్రబాలెం చేరుకొన్న ప్రతినిధులు ఎన్టీఆర్ క్యాంటీన్‌ను పరిశీలించారు. రాయితీపై పేదలకు అందిస్తున్న ఆహార పదార్థాలను రుచిచూశారు. ఎర్రబాలెంలోని కాంపిటెంటివ్ అథారిటీ కార్యాలయంలోని రిజిస్టర్లన్రు తనిఖీ చేశారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపులు, కూలీలకు అమరావతి పింఛన్లు పంపిణీ లాంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు.