రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో స్వల్ప భూకంపం
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో (Jaipur) స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 8.01 గంటలకు జైపూర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. జైపూర్‌కు 92 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
జమ్ముకశ్మీర్‌లోని కత్రాలో బుధ, గురువారాల్లో భూమి స్వల్పంగా కంపించింది. గురువారం తెల్లవారుజామున 3.02 గంటల సమయంలో కత్రాలో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది. బుధవారం ఉదయం 5.43 గంటలకు పహల్గామ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.2గా నమోదయిందని తెలిపింది.