రాజస్ధాన్ హైకోర్టులో సల్మాన్ ఖాన్ కు ఊరట…

81469426209_160x120జైపూర్‌: వన్య ప్రాణులను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు వూరట లభించింది. ఈ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు చెప్పింది.

1998లో హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్‌ కోసం సల్మాన్‌ రాజస్థాన్‌ వెళ్లారు. ఆ సమయంలో జోధ్‌పూర్‌ శివారులోని అటవీ ప్రాంతంలో సల్మాన్‌ అక్రమంగా రెండు కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతడిపై రెండు కేసులు నమోదు చేశారు. దీనిపై విచారించిన జోధ్‌పూర్‌ కోర్టు.. రెండు కేసుల్లోనూ ఏడాది, ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. అయితే స్థానిక కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. రాజస్థాన్‌ హైకోర్టులో సల్మాన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మే చివరి వారంలోనే ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తి కాగా.. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది.