రాజ్యసభకు మోపిదేవి, ఈద మస్తాన్‌ రావు రాజీనామా


ఛైర్మన్‌ దన్‌కడ్‌ను కలిసి రాజీనామాల సమర్పణ
పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
త్వరలోనే టిడిపిలో చేరుతామని వెల్లడి
న్యూఢల్లీి,ఆగస్ట్‌29 (జనంసాక్షి): రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీకి సైతం రాజీనామా
చేశారు. ఇద్దరు ఎంపీల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి మోపిదేవి కుడి భుజంలా వ్యవహస్తే.. బీద మస్తాన్‌ రావుపార్టీలో కీలక వ్యవహరించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. మరో ఎంపీ బీద మస్తాన్‌రావుతో కలిసి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. త్వరలో తాను తెదేపాలో చేరబోతున్నట్లు తెలిపారు. దిల్లీలో విూడియాతో ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు. ‘అధికారం నాకు కొత్తేవిూ కాదు.. గతంలో ఎన్నో పదవుల్లో పనిచేశాను. గత ఏడాదికాలంగా నా నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఇబ్బంది పడ్డా. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులతో రాజీనామా చేస్తున్నాను. ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా ప్రజలు ఘోరాతిఘోరమైన తీర్పు ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంత మంది రాజీనామా చేశారు. లోపం ఎక్కడ ఉందనే దానిపై వైకాపా అధిష్ఠానం విశ్లేషించుకోవాలి. అనుభవం ఉన్న నేత సీఎం చంద్రబాబు. రాష్టాన్ని ఆయన గాడిలో పెడుతున్నారు. చంద్రబాబు సారథ్యంలో పనిచేయాలని భావిస్తున్నాను. త్వరలో తెదేపాలో చేరబోతున్నా. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నా‘అని మోపిదేవి అన్నారు. ఇప్పుడు వీరిద్దరూ పార్టీకి రాజీనామా చేయడంతో కేడర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నేతలే తమ దారి తాము చూసుకుంటుంటే తమ పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరూ అటు పదవికి, ఇటు పార్టీకి ఏకకాలంలో రాజీనామా చేశారు. వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడిరచారు. ఏ సందర్భంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నాను ఏమిటనేది వైసీపీ నేతలే ఆలోచించాలన్నారు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో వైసీపీ వాళ్లే చెబుతారని అన్నారు. చిల్లరగా మాట్లాడే మనస్తత్వం తనది కాదని.. రాజ్యసభ పదవిపై తాను మొదటి నుంచి ఇంట్రెస్ట్‌ గా లేనన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరుతానని మోపిదేవి వెంకట రమణ ప్రకటించారు. రాజకీయ వ్యవస్థను.. రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టాలని చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు కూడా తనతో చర్చించారని మోపిదేవి వెల్లడిరచారు.
నియోజకవర్గం వెళ్లి కార్యకర్తలతో సమావేశం అవుతానని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత తాను ఖాళీగా ఉండాలని అనుకోవడం లేదన్నారు. వైసీపీ అధినేత జగన్‌ తన వైఖరి మార్చుకోవాలన్నారు. పార్టీ మారుతున్న తనపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. గతంలో తనకు ఎలాంటి ఇబ్బందులు కలగజేసారో అందరికీ తెలుసని మోపిదేవి తెలిపారు. మొత్తానికి మోపిదేవి, బీద మస్తాన్‌ రావులు ముందుగా చెప్పినట్టుగానే రాజీనామా చేశారు. అయితే వీరి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నారని సమాచారం. వారిలో అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా వైసీపీని వీడి టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్‌.రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం బీద మస్తాన్‌ విూడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు బీద రవిచంద్ర కూడా టీడీపీలోనే ఉన్నాడన్నారు. మోపిదేవి వెంకటరమణ కిందిస్థాయి నుంచి వచ్చారన్నారు. చైర్మన్‌ ఫార్మాట్లోనే రాజీనామా చేశానన్నారు. రాబోయే రాజకీయ భవిష్యత్తుపై కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. చంద్రబాబు నాయుడు కలిశారని బీద మస్తాన్‌ రావును అడగ్గా… గతంలో చంద్రబాబు నాయుడు మా బాస్‌ అని సమాధానమిచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛందంగా రాజీనామా చేశానని బీద మస్తాన్‌ రావు తెలిపారు.
—————