రాజ్యాంగ నిర్మాతకు పూలమాల వేసిన టిఆర్ఎస్ నాయకులు

 

-కేసీఆర్,రెడ్యానాయిక్ చిత్రపటానికి పాలాభిషేకం

కురవి సెప్టెంబర్-16
(జనం సాక్షి న్యూస్)

తెలంగాణ నూతన సచివాలయం కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు, డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చిత్రపటాలకు బలపాల గ్రామ టిఆర్ఎస్ నాయకులు,పార్టీ అభిమానులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.ఈ సందర్భంగా కురవి మండలం రైతుబంధు కోఆర్డినేటర్ ముండ్ల రమేష్ మాట్లాడుతూ… తెలంగాణ సచివాలయం కు అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీయమన్నారు. అదేవిధంగా భారత పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ దేహమని అన్ని వర్గాల ప్రజలకు క్షేమంకోరే ప్రజా నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బలపాల గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు నామ సైదులు ,కురవి మండల టిఆర్ఎస్ ఉపాధ్యక్షులు భక్తుల వెంకన్న, లింగ్యాతండా సర్పంచ్ రామ్ లాల్, బలపాల జడ్పీ స్కూల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఐతం సైదులు, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు జగదీష్, మాజీ అధ్యక్షుడు గంట వెంకటేశ్వర్లు, కోట రవి, కుక్కల వెంకన్న, మదన్ ,సూరి, సత్యనారాయణ, ఎల్లప్ప, రవికుమార్ , ముత్తయ్య టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.