రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయం.
-డా.రసమయి బాలకిషన్.
బెజ్జంకి,సెప్టెంబర్9,(జనం సాక్షి): మండల కేంద్రములోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి చేసి,అనంతరం గుగిల్ల గ్రామంలో నూతన అంబేడ్కర్ భవనాన్ని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ప్రారంభోత్సవం చేశారు.అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో,మార్కేట్ కార్యాలయంలో కాళోజి చిత్రపటానికి పూల మాల వేశారు.ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబా సాహెబ్ అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.సమాజంలో అస్పృశ్యతను నివారించడం నుండి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు.న్యాయవాదిగా,ఆర్ థిక శాస్త్రవేత్తగా,రాజకీయ నేతగా,సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహా నాయకుడు డా.బిఆర్.అంబేద్కర్ అని కొనియాడారు.సమాజంలో బహుజనులు గౌరవప్రదంగా జీవించేందుకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు.ఆయన స్ఫూర్తితో బహుజనులంతా ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.తద్వారా హక్కులు విధులు తెలుసుకొని సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారని సూచించారు.దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు.దళితులు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో కేసీఆర్ మన దళితుల కొరకు దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు.యూనిట్లను సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యమంత్రి కన్న కళలను నిజం చేస్తూ,ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే రసమయి కోరారు.అదే విదంగా పేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్ అని అన్నారు.పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగ నిలుస్తోందన్నారు.ప్రజా సంక్షేమమే ప్రభుత్వ
లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్,జెడ్పీటీసీ కనగండ్ల కవిత తిరుపతి,మండల కో ఆప్షన్ సభ్యులు పాకాల మహిపాల్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ కచ్చు రాజయ్య,సర్పంచ్ ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్,తెరాస రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా,సర్పంచ్లు సీత లక్ష్మి భూమయ్య,చింతలపల్లి సంజీవ రెడ్డి,ఎంపీటీసీ ల ఫోరం మండల అధ్యక్షులు దుంబాల రాజా మహేందర్ రెడ్డి,ఎంపీటీసీ కోమిరే మల్లేశం,పెండ్యాల బాపూ రెడ్డి,తెరాస సోషల్ మీడియా ఇంఛార్జి ఎల శేఖర్ బాబు,తెరాస మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,గుగ్గిళ్ళ తిరుపతి,గన్నమ నేనీ బాల సుధీర్ రావు,ముక్కిశ రాజిరెడ్డి,ముక్కీస తిరుపతి రెడ్డి,ఎలుక దేవయ్య,మేకల శ్రీకాంత్,బోయినపల్లి క్రిష్ణ రావు,చెప్యాల సంతోష్,బిగుల్ల సుదర్శన్,బిగుల్ల మోహన్,సతీష్,అర్జున్,గుగ్గిల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.