రాఫెల్‌లో భారీ కుంభకోణం: రఘువీరా

కర్నూలు,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణం దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈనెల 18న ఏపీలో రాహుల్‌గాంధీ పర్యటిస్తారని రఘువీరా వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా దామోదరం సంజీవయ్య స్మారకభవనాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి, బహిరంగసభలో పాల్గొంటారని వివరించారు.

తాజావార్తలు