రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రాల సరిహద్దులో పకడ్బందీ చర్యలు – జోగుళాంబ జోన్ డి. ఐ జి ఎల్. యస్. చౌహాన్.

త్వరలో రాష్ట్రం లో జరుగబోయే ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ల సరిహద్దులో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయటం తో పాటు మద్యం, డబ్బు ఇతర ఇల్లీగల్ కు సంబందించి అక్రమ రవాణా జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జోగుళాంబ జోన్ డి. ఐ. జి ఎల్. ఎస్. చౌహాన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం లోని సమావేశ హాల్ నందు జోగుళాంబ గద్వాల,నారాయణ పేట, నాగర్ కర్నూల్ జిల్లా ల పోలీస్ అధికారులతో పాటు ఆంద్ర ప్రదేశ్ లోని కర్నూల్, కర్ణాటక రాష్ట్రంలో నీ రాయచూర్, యాద్గిరి జిల్లా పోలీస్ అధికారులతో రాబోయే ఎన్నికల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి ఇంటర్ స్టేట్ బోర్డర్ పోలీస్ అధికారులతో కో- ఆర్డినేషన్ మిటింగ్ నిర్వహించటం జరిగింది.ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో రాయచూర్ , యాద్గిరి, కర్నూల్, నంద్యాల జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలక్షన్ల సమయంలో మద్యం, నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు, ఇరు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని నిర్ణయించారు.ఈ సంధర్బంగా డి. ఐ. జి మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ కు సంబంధించి నారాయణ పెట్, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలో ఇతర రాష్ట్రాల తో సరిహద్దులో వున్న సమస్యాత్మకమైన గ్రామల పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులను, కర్నాటక సరిహద్దుల్లో రెండు చేక్ పోస్ట్ లు, నారాయణ పేట కర్నాటక సరిహద్దుల్లో 7 చెక్ పోస్టులను, నాగర్ కర్నూల్ జిల్లా ఆంధ్రప్రదేశ్ కు సంబందించి ఒక చెక్ పోస్ట్ ను నిరంతరాయంగా కొనసాగిస్తూ పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జోగుళాంబ గద్వాల, నారాయణ పేట, నాగర్ కర్నూల్ జిల్లా చెక్ పోస్టులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో కూడ చెక్ పొస్ట్ లను సంభందిత అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా రాష్ట్రాల పోలీస్ అధికారులకు సూచించారు.గతంలో మధ్యం అక్రమ రవాణా తరచూ చేస్తూ పట్టుబడిన వారి పై కూడ నిఘా పెట్టి వారిని నియంత్రించే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు,సరి హద్దు ల్లో హై వే పెట్రోలింగ్, మొబైల్ పెట్రోలింగ్ ఆక్టివిటీస్ ను పెంచాలని సూచించారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు పోలీస్ అధికారులు వాట్సప్ గ్రూప్ లను ఏర్పాటు చేసుకొని సమాచారo ఎప్పటికప్పుడు పంచుకొని నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. 2018 ఎన్నికలలో ఆయా చెక్ పోస్టులలో పట్టుబడిన మధ్యం, నగదు, లిక్కర్, ఇతర ఇల్లీగల్ రవాణా కేసుల వివరాలను సమీక్షించారు. రాబోయే ఎన్నికలను సీరియస్ గా తీసుకోని నిజాయితీగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు డీ. ఐ. జి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. సృజన, నాగర్ కర్నూల్ ఎస్పీ కె .మనోహర్, నారాయణ పేట జిల్లా ఎస్పీ వేంకటేశ్వర్లు, జిల్లా అదనపు ఎస్పీ ఎన్.రవి,డి. ఎస్పీ పి. వేంకటేశ్వర్లు, రాయచూర్ డి. ఎస్పీ సత్యనారాయణ, బళ్లారి ఐ జి కార్యాలయ డి. ఎస్పీ అస్లాం బాషా, యాద్గిరి డి. ఎస్పీ బసవేశ్వర్, నారాయణ పెట్ డీసీ ఆర్బీ డి. ఎస్పీ జె. వేంకటేశ్వర్లు, కర్నూల్ సి. ఐ గుణ శేఖర్, ఏర్రగిర సి. ఐ నాగప్ప , ఇడుపనూర్ ఎస్సై అవినాష్ కాంబ్లీ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు