రాయికోడ్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్

రాయికోడ్ జనం సాక్షి జూలై  06రాయికోడ్ ఏబీవీపీ  ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కావున ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యం పూర్తిస్థాయిలో బంద్ కార్యక్రమాన్ని పాటించారని ఏబీవీపీ *మండల కన్వీనర్ రాజు* తెలియజేశారు. పాఠశాలలు పునః ప్రారంభమై 25 రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫామ్ లను పంపిణీ చేయలేదన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న రాష్ట్రంలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్లను భర్తీ చేయకుండా యధావిధిగా పాఠశాలల విద్యను కొనసాగిస్తుందని. పేద విద్యార్థులకు సరైన సబ్జెక్టులు బోధించే టీచర్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రాహం వ్యక్తం చేశారు. “మన ఊరు మనబడి ” కార్యక్రమం పేరుకు మాత్రమే మిగిలిపోయిందని ఒక్క పాఠశాలలో కూడా సరైన మౌలిక వసతులు లేవని ఎద్దేవా చేశారు. ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలు పుస్తకాలు మరియు యూనిఫాంల పేరిట పేద ప్రజలను దోచుకున్న మీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తుందని తెలియజేశారు. ఫీజు నియంత్రణ చట