రాయికోడ్ లో పర్యటించిన ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారులు

రాయికోడ్ మండల   కేంద్రమైన రాయికోడ్ లో గురువారం ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారులు యోగేష్ కులాల్, దేవేశ్ పాండే, అభినవ్ పర్యటించారు, ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిబ్బంది వివరాలు, నేర నియంత్రణలు,ప్రమాద నివారణకు చేపడుతున్న చర్యల గురించి ఏఎస్సై మణయ్య ను అడిగి తెలుసుకున్నారు, తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రసూతి గదిని,ల్యాబ్ ను,వైద్య సేవలను పరిశీలించారు, వీరికి మండల వైద్యాధికారి శ్రవణ్ హాస్పిటల్ లో  రోగులకు అందిస్తున్న సేవలు,మొదలగు వాటి గురించి వివరించారు,అనంతరం అల్లపూర్ చౌరస్తా వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల కు వచ్చి తరగతి గదులను,హాస్టల్ గదులను,వంట గదిని,స్టోర్ రూమ్ లను పరిశీలించి,విద్యార్థినిలతో సమావేశం నిర్వహించి మీకందరికీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని,మీరు చదువుకుని ఏమవుతారని అడిగి తెలుసుకున్నారు,చివరిగా మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి  ,అధికారులను,సిబ్బంది ని, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులను పరిచయం చేసుకుని,వారిని ఉద్యేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశం ఏపీవో గురుపాదం గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ప్రిన్సిపాల్ మానివి చందు సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఉప సర్పంచ్ నాగేష్ పంచాయతీ కార్యదర్శి మల్లేశం సుప్రియ.  ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్ మల్లప్ప పాల్గొన్నారు