రావెల విగ్రహావిష్కరణ

గుంటూరు,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  సతైనపల్లిలో మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ శస్త్రచికిత్స వైద్యులు రావెల వెంకట్రావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. సభాపతి డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైవి.ఆంజనేయులు, యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సి రాయపాటి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. రావెల వెంకట్రావు విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో రావెల సేవలను కొనియాడారు.

తాజావార్తలు