రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం పెచ్చరిల్లుతుంది:అనం రాంనారాయణరెడ్డి
హైదరాబాద్, జనంసాక్షి: ఒక వ్యక్తి జాతి సంపదను దోచుకొని నేల మాలిగలాలో దాచుకొని రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదనికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి అనం రాంనారాయణరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అధికారం కోసం రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేస్తున్న వ్యక్తి తరిమికొట్టాలని పరోక్షంగా వైఎస్‌ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల జీవితాలను కడగండ్లపాలు చేసిన చంద్రబాబు నేడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడని ఆరోపించారు. ఆర్థిక ఉగ్రవాదాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.