రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం హర్షణీయం

శాసన మండలి చైర్మన్ గుత్తా
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ ఉత్సవాలను జరుపుకోవడం హర్షణీయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం నల్గొండ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత దేశం లో కలిసి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 సంవత్సరం లోకి అడుగు పెడుతున్నదని అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.
రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం …ఆనాడు పోరాటం లో అసువులు బాసిన వారికి జోహార్లు అర్పించారు.
బాధ్యత లేకుండా కొంత మంది విలీనం ,విమోచనo అంటూ, ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని
తెలంగాణ ఉద్యమం అంటే ఎంటో తెలియని వారు కూడా ఏదేదో మాట్లాడటం దౌర్భాగ్యం..
రాష్ట్ర గవర్నర్ కూడా విమోచన దినo అని వ్యాఖ్యలు చేయడం దౌర్బాగ్యం… ఆమె పని చేసిన తన పూర్వ పార్టీ భావజాలాన్నే అనుసరిస్తుందని,గవర్నర్ వ్యవస్థ కి వుండే గౌరవం పోగొట్టొద్దని సూచించారు.
కేంద్రం హైదరాబాద్ పరేడ్ గ్రౌడ్ లో నిర్వహించే సభ పెట్టడం సరికాదు.వాళ్లకు ఎం అవసరం.
కేంద్రం ఫెడరల్ వ్యవస్థ కి విఘాతం కలిగిస్తున్నదని,కేంద్రం రాష్ట్ర ల హక్కులను హరిస్తున్నది.
రాష్ట్రాలను ఇబ్బందులు పెడుతున్నది.
కేంద్రం ఫెడరల్ వ్యవస్థ కు భంగం కలిగిస్తున్నదని ఆరోపించారు.