రాష్ట్రంలో తివర్ణం రెప రెప
` అట్టహాసంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
` టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో ర్యాలీలు
` హైదరాబాద్‌లో జెండా ఊపిని సిఎస్ సోమేశ్ కుమార్
` పలు ప్రాంతాల్లో ర్యాలీల్లో పాల్గొన్న మంత్రులు,ఎమ్మెల్యేలు
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు శుక్రవారం రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో దాదాపు 15వేల మందితో జాతీయ జెండాలు చేబూని ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.టీఆర్‌ఎస్ నేతలు అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ర్యాలీని ప్రారంభించారు. అవిూర్ పేట లోని కనకదుర్గమ్మ దేవాలయం నుండి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. మరోవైపు ఐ మ్యాక్స్ చౌరస్తా నుంచి పీపుల్స్ ఎª`లాజా వరకు గ్రేటర్ టీఆర్‌ఎస్ ర్యాలీ నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంబించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. నగరంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలకు హోంమంత్రి మహ్మద్ అలీతో పాటు, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. రాష్ట్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ… 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ఏడాదిపాటు నిర్వహిస్తోంది. మూడురోజులపాటు ప్రారంభ కార్యక్రమాలు జరగనుండగా 17నతెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తూ… రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు.తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యవ్యవస్థలోకి వచ్చి రేపటితో 74 ఏళ్లు పూర్తి అవుతోంది. 75వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరిట ఏడాదిపాటు ఘనంగా వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నేటి నేటి నుంచి మూడు రోజుల పాటు వజ్రోత్సవ ప్రారంభ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో… భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలను భాగస్వామ్యం చేశారు. జాతీయజెండాల్ని చేతబూని ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చారిత్రక సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ సెంట్రల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా… సికింద్రాబాద్‌లో ర్యాలీ చేపట్టారు. ప్యారడైజ్ నుంచి గాంధీ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీని… మంత్రి తలసాని శ్రీనిసవాస్ యాదవ్ ప్రారంభించారు. జాతీయజెండా పట్టుకుని ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. రాచరికం నుంచి… ప్రజాస్వామ్యంలోకి వచ్చి 75 వసంతాలు పూర్తికావడంతో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ సవిూపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీశ్ ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. అందులో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని విూర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆ ప్రదర్శనను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కూకట్‌పల్లి నుంచి దయర్‌గూడలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకి ప్రదర్శన చేపట్టారు. ఆ కార్యక్రమంలో వివిధ కళాశాల విద్యార్థులతోపాటు కలిసి పలువురు అధికారులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వరంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ర్యాలీకి పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మియాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి చందానగర్ పీజేఆర్ స్టేడియం వరకు చేపట్టిన ర్యాలీకి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం పాతబస్టాండ్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీనీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాను చేతపట్టి వేలాదిగా పాల్గొన్నారు. అంబర్‌పేట్ పరిధిలోని ఆలీ కేఫ్ ఎక్స్‌రోడ్ నుంచి మున్సిపల్ గ్రౌండ్ వరకు ప్రదర్శనను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు.మల్లేపల్లి చౌరస్తా వద్ద నుండి మెహిదీపట్నం ఎంపీ గాª`డ్గంªన్స్ వరకు చేపట్టిన ర్యాలీలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్, ఎమ్మెల్సీ ప్రభాకర్ తదితర నేతలు పాల్గొన్నారు. కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంనాగేందర్ ఆధ్వర్యంలో… ఇమాక్స్ థియోటర్ నుంచి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ఎª`లాజావరకు కొనసాగిన ర్యాలీలో… రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థులు, జీహెచ్‌ఎంసీ, ఆశా కార్మికులు పాల్గొన్నారు. సుమారు 10 వేల మంది ర్యాలీలో జాతీయ జెండాలను చేతపట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు.