రాష్ట్రంలో మరో కుంభకోణం

` ఎక్సైజ్ శాఖలో మైక్రో బేవరేజెస్‌కు అనుమతుల్లో అవినీతి:హరీశ్‌రావు
హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో మరో అవినీతి కుంభకోణాన్ని బయటపెడుతున్నట్లు మాజీ మంత్రి, బీఆరఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. ఎక్సైజ్ శాఖలో కొత్తగా మైక్రో బేవరేజెస్‌కు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. “110 దరఖాస్తుల్లో 25కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త అనుమతుల్లో ముఖ్య నేత కోటా 21, మంత్రి కోటా 4” అని హరీశ్ రావు ఆరోపించారు.