రాష్ట్రం పరిశ్రమల హబ్‌గా మారబోతుంది

– ఏపీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి

ఏలూరు, ఆగస్టు8(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్రం పరిశ్రమల హబ్‌గా మారబోతుందని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అంబర్‌పేటలో నిర్మించిన ఎక్డిల్‌ కంపెనీని బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే కాలంలో మరిన్ని సిరామిక్‌ పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నాయని స్పష్టం చేశారు. దావోస్‌ సమ్మిట్‌ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాల పట్ల ఎక్జిల్‌ కంపెనీ ప్రతినిధులు ఆకర్షితులయ్యారని వెల్లడించారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుల్లో రూ. 16లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 35లక్షల ఉద్యోగాలు రానున్నాయని, అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి గుర్తు చేశారు. కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక ¬దా ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు గట్టిగా నిలదీస్తున్నారని మంత్రి పేర్కన్నారు. కానీ ప్రత్యేక మోదా ఇవ్వాల్సిన ఉన్నా ఇవ్వని మోదీని నిందించాల్సిన జగన్‌, పవన్‌లు కేంద్రంపై విభజన చట్టంలోని హావిూలకోసం పోరాడుతున్న చంద్రబాబును విమర్శిస్తుండటం సిగ్గుచేటన్నారు. ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని మంత్రి హెచ్చరించారు.

 

తాజావార్తలు