రాష్ట్రం మోసాల తెలంగాణగా మారింది: రమేశ్‌ రాథోడ్‌

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి):  చంద్రబాబు వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్‌ వల్ల అది మోసాల తెలంగాణగా మారిందని టిడిపి ఆదిలాబాద్‌  నేత రమేశ్‌ రాథోడ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రహదారి, విద్యుత్‌ సౌకర్యాలు తెదేపా హయాంలో వచ్చినవేనని, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు కూడా రావడం లేదన్నారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిలదీయాలని, అందరం కలిసి ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్‌ మాటలతో కాలం గడుపుతూ టిడిపి నేతలను చేర్చుకునే పనిలో చేరికలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. టిడిపి నుంచి వెళ్లేవారు తమ పదవులకు రాజీనామాచేసి పోవాలన్నారు. అలాచేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదన్నారు. అయితే టిడిపి నుంచి గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరడం దారుణమన్నారు. ఇదిలావుంటే బాబు పర్యటన సందర్భంగా కరీంనగర్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరీంనగర్‌ పర్యటనన పురస్కరించుకుని ఎమ్‌.ఆర్‌.పి.ఎస్‌.నాయకుడు మంద కృష్ణ మాదిగను ¬టల్‌ నిర్భందించినట్లు సమాచారం. చంద్రబాబుకు పోటీగా సభ నిర్వహిస్తామని కృష్ణ హెచ్చరించారు.టిడిపి షెడ్యూల్‌ కులాల వర్గీకరణకు సంబందించి చంద్రబాబు మాట మార్చుతున్నారని ఆయన మండిపడుతున్నారు.అయితే కరీంనగర్‌ లో ఉద్రిక్తత ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.అందులో భాగంగా మందకృష్ణ బస చేసిన శ్రీనివాస లాడ్జి చుట్టూరా పోలీసులు మొహరించారు.ఆయనను బటయకు రానివ్వకుండా ¬టల్‌ లోనే నిర్భందించారని సమాచారం. .పలువురు ఎమ్‌.ఆర్‌.పి.ఎస్‌. కార్యకర్తలు,నేతలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.