రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మాను రాజకీయాలకతీతంగా గెలిపించాలి:-

 

.
మిర్యాలగూడజనం సాక్షి 
 దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అట్టడుగు అణగారిన  వర్గాలైన గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినందున దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న అట్టడుగు అణగారిన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు రాజకీయాలకతీతంగా ఓటు వేసి గెలిపించాలని యాదవ సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు చిమట ఎర్రయ్య చేగొండి మురళి యాదవ్, ఎరకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య, మైనార్టీ సంఘం జిల్లా నాయకులు మోసిన అలీలు కోరారు. ఆదివారం మిర్యాలగూడలో జరిగిన అణగారిన వర్గాల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఒక సామాన్య గిరిజన మహిళ దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతికి ఎంపిక కావడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎంపిక అయితే దేశంలోని అణగారిన వర్గాల సమస్యలు పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉందన్నారు. అన్ని ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు రిజర్వుడు కేటగిరి  ఎంపీ , ఎమ్మెల్యే ఎమ్మెల్సీ.. రాజ్యసభ  సభ్యులు ఓటేసి ద్రౌపది ముర్మా ను  గెలిపించాలని పేర్కొన్నారు. సమావేశంలో బుడబుక్కుల సంఘం రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు మహేష్,వెనుకబడిన వర్గాల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు నీలకంఠ నాయక్ దశరథ నాయక్, రాకేష్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area