రాష్ట్రపతి ఎన్నికలలో ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపతి ముర్మ్ కి మద్దతు ఇవ్వండి
పార్టీలకు ఆథితంగా ఆదివాసీ సంతాల్ తెగకు చెందిన ద్రౌపతి ముర్మ్ కి మద్దతు ఇవ్వండి
ఆదివాసీ నాయకపోడ్ ములుగు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్…..
ములుగు బ్యూరో,జూలై18(జనం సాక్షి):-
సోమవారం రోజున ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ అద్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ గుడి వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది .సమావేశం అనంతరం ఆదివాసీ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి సరిగా ఆదివాసీ సంతాల్ తెగకు చెందిన ద్రౌపది మూర్మ్ ని కేంద్ర ప్రభుత్వం అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. భారత దేశంలో పార్టీ లకు సంబంధం లేకుండా ఆదివాసీ ముద్దు బిడ్డ ద్రౌపతి ముర్మ్ కి మద్దతి ఇచ్చి ఆదివాసీ జాతికి అండగా ఉండాలని దేశంలో ఉన్న ఎమ్మెల్యే ,ఎంపీ ఓట్ హక్కు ను ఆదివాసి అభ్యర్థి కి మద్దతు ఇవ్వాలని కోరారు . అలాగే భారత దేశంలో అతిపెద్ద నాలుగవ గిరిజన తెగ సంతాల్ కు చెందిన ద్రౌపది ముర్మ వంశస్థుల పోరాట చరిత్ర ప్రథమ స్వాతంత్ర పోరాటంలో కీలకమైనది అని అన్నారు .వారి పోరాట ప్రతిమ గుర్తు ఈరోజు ఆదివాసుల ఉద్యమ పోరాట వీరుడు బిట్స్ ముండా కొమరం భీం వారసురాలిగా ద్రౌపది ముర్మ కి భారతదేశం ప్రథమ పౌరురాలిగా నిలబెట్టి ఆదివాసీ మనుగడకు కీర్తించేవిధంగా మద్దతు ఇవ్వాలని కోరారు. దేశంలో ఉన్న ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యే లు, ఎంపీ లు అందరూ కలిసి ఆదివాసీ అభ్యరికి మాత్రమే ఓటేవెయ్యలని అన్నారు .ద్రౌపతి ముర్మ్ విజయం ఆదివాసుల ఆత్మ గౌరవం విజయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ జిల్లా నాయకులు కొత్త సదయ్య,ఆకుల మోగిలి,అరిగెలా సమ్మయ్య,కొత్త నిర్మల,ఆకుల లసుమమ్మ, చిర్ర ముత్తెష్,అచ్చ సాంబయ్య,మండపు సుమలత, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.