రాష్ట్రపతి విరాళాల కేసు.

తన ఆదేశాలపై తనే స్టే జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూడిల్లీ: ఢిల్లీ హైకోర్టు తన ఆదేశలనే నిలుపుదల చేస్తూ స్లే జారీ చూసింది. సమాచార హక్కు చట్టం కింద రాష్ట్రపతి చేసిన విరాళాల, గ్రహీతల పేర్లను రాష్ట్రపతి సెక్రటేరియట్‌ బహిరంగ పరచాలంటూ సీఐసీ ఇచ్చిన ఆదేశాలను సమర్ధించిన జస్టిన్‌ విపిన్‌సింఘీ అదేశాలను నిలుపుదల చేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ రాజీవ్‌ సహయ్‌లతో కూడిన ధర్మాసనం స్టే ఇచ్చింది. 2009 నుంచి 2011 మద్య రాష్ట్రపతి చేసిన విరాళాల సమాచారం కావాలంటూ సహచట్టం కింద నతీశ్‌కుమార్‌త్రిపాఠి అనే ఉద్యమకారుడు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై స్పందించిన ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ) త్రిపాఠి అడిగిన సమాచారన్ని ఇవ్వాలంటూ మే 4న రాష్ట్రపతి భవన్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి భవన్‌ పెట్టుకున్న పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి జస్టిస్‌ విపిన్‌సంఘ్వీ తిరన్నరిస్తూ రాష్ట్రపతి విరాళాలను తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఆదేశాలను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది.