రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాం : గాదె
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. అనంతరం గాదె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరినట్లు తెలిపారు. అత్యవసర భేటీ ఉన్నాందున వయలార్ రవి రేపు కలుద్దామని చెప్పినట్లు వెల్లడించారు.