*రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ ల సమస్యలు పరిష్కరించడంలో విఫలం*
4వ రోజు వీఆర్ఏల నిరవధిక సమ్మెకు మద్దతు:డాక్టర్ అంజి యాదవ్
కోదాడ జులై (జనం సాక్షి)
రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ ల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మల్లేబోయిన అంజి యాదవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వీఆర్ఏల సమ్మెలో భాగంగా కోదాడ తహసిల్దార్ కార్యాలయంలో నాలుగవ రోజు వీఆర్ఏలకు మద్దతు తెలిపిన డాక్టర్ అంజి యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 లో భూప్రక్షాళన అనే కార్యక్రమాన్ని పెట్టినారు. ఈ భూప్రక్షాళన లో అధికారులు కూడా చెయ్యని పనిని వీఆర్ఏలు చేసినారు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించకపోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. ఒక గ్రామానికి ఎంత పెద్ద అధికారి వచ్చినా ఆ గ్రామంలో ఉన్న వీఆర్ఏ తో గ్రామ సమస్యను తెలుసుకునేవారు గ్రామ ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా వీఆర్ఏలు పనిచేస్తున్నారని తెలిపారు. ఇంతవరకు వీఆర్ఏలకు పేస్కేలు ఇవ్వకపోవడం దురదృష్టకరం అన్నారు. విఆర్ఎల్ పై రాష్ట్ర ప్రభుత్వం చవతి తల్లి ప్రేమ చూపిస్తుందని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు రాజశేఖర్ నాయుడు దేశినేని కత్తిమాల వెంకన్న మల్లేష్ వీఆర్ఏలు లక్ష్మారెడ్డి శేఖర్ నాగమణి సునీత సుకన్య నేహరీన్ సుధా శ్రీను హరి గోపి సైదా తదితరులు పాల్గొన్నారు
.
Attachments area