రాష్ట్ర రాజకీయాలపై రాహుల్‌ దృష్టి


గెలుపు గుర్రాల కోసం అన్వేషణ

ప్రత్యేక దూతలతో సర్వే

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 1 (జనంసాక్షి):

రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీ వలసలు, వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపిక తదితర అంశాలపై కాంగ్రెస్‌ హైక మాండ్‌ దృష్టి సారిం చింది. రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ నేరుగా రంగం లోకి దిగారు. రాష్ట్రంలో పార్టీని చక్క దిద్దడానికి తీసుకొ ళివాల్సిన చర్యలపై, లోక్‌సభ సీట్లకు అభ్యర్థు లపై ఎంపికపై దృష్టి సారిం చారు. ఈ మేరకు

ఆయన తరఫున గోవాకు చెందిన జితేందర్‌ దేశ్‌ముఖ్‌, విశ్వజిత్‌ రాణెళిలను రాష్టాన్రికి పంపించారు. వీరిద్దరు హైదరాబాద్‌లో తిష్టవేసి వివిధ అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. శనివారం కోస్తా, రాయలసీమకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. జితేందర్‌ దేశ్‌ముఖ్‌, విశ్వజిత్‌ సీఎల్పీ కార్యాలయంలో నేతల అభిప్రాయలు సేకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి, 2014 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, తదితర అంశాలపై రాహుల్‌ దూతలు ఆరా తీశారు. పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపిక, పార్టీ పరిస్థితి, జగన్‌ పార్టీ వంటి వివిధ అంశాలపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. జగన్‌తో రాజీకి వస్తే ప్రయోజనం ఉంటుందా? అని రాష్ట్ర నేతల అభిప్రాయాలు సేకరించారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం రాహుల్‌ ప్రతినిధులు ప్రధానంగా దృష్టి సారించారు. స్థానిక నేతల అభిప్రాయాలతో ప్రస్తుత ఎంపీల పనితీరుపై ఆరా తీశారు. అలాగే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో రాజీపడడం మంచిదా? కాదా? అన్న అంశంపై దూతలు ఆరా తీశారు. అలాగే, ప్రస్తుత ఎంపీల పనితీరు, వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు నేతలు జగన్‌ పార్టీతో రాజీ కుదుర్చుకోవాలని వారికి సూచించారు. పార్టీ పరిస్థితి దయానీయంగా తయారైందని కుండబద్దలు కొట్టారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష ¬దా కూడా దక్కదని తేల్చిచెప్పారు. నేతల మధ్య కుమ్ములాటలు, అంతర్గత విభేదాలతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని జితేందర్‌ దేశ్‌ముఖ్‌, విశ్వజిత్‌ల దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ నేతల మధ్య ఐక్యత తీసుకురావడంతో పాటు నామినేటేడ్‌ పదవులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం కల్పించే రీతిలోవివిధ కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ చాలా బలహీనమైందని, ఇప్పటి నుంచే మేలుకోకపోతే.. ఎన్నికల్లో ఘోర పరాభావం తప్పదని హెచ్చరించారు.

జగన్‌ బలాబలాలపై రాహుల్‌ దూతలు ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం. జగన్‌తో రాజీ పడితే లాభమా? నష్టమా? అని అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు నేతలు జగన్‌తో రాజీ పడడమే మేలని సూచించారు. కోస్తా, సీమ ప్రాంతంలో జగన్‌ పార్టీ చాలా బలంగా ఉందని, తెలంగాణలో కూడా బలపడుతోందని వారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనతో రాజీ కుదుర్చుకుంటేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయం చెప్పినట్లు తెలిసింది. అయితే, జగన్‌ రాజీకి వస్తాడా? అని జితేందర్‌ దేశ్‌ముఖ్‌ ప్రశ్నించగా.. సీబీఐ కేసులు ఎత్తేసి, ముఖ్యమంత్రి పదవి ఇస్తే రాజీకి వచ్చే అవకాశం ఉందని జేసీ బదులిచ్చినట్లు తెలిసింది. సిట్టింగ్‌ ఎంపీల పనితీరు సరిగా లేదని, లోక్‌సభ స్థానాల్లో కొత్త అభ్యర్థులను పోటికి దింపాలని జేసీ కోరినట్లు సమాచారం. జగన్‌తో రాజీకి రాకుంటే.. చాలా మంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీలోకి చేరుతారని మరికొంత స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైందని, హైకమాండ్‌ నేరుగా రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దకపోతే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన చిత్తూరు జిల్లా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిపై కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాహుల్‌ దూతలకు ఫిర్యాదు చేశారు. జగన్‌ పార్టీలో చేరేందుకే ఆయన రాజీనామా చేశారని ఆరోపించారు. మరో పది ఎమ్మెల్యేలు కూడా జగన్‌ వైపు వెళ్లే అవకాశం ఉందని రాహుల్‌ దూతలకు చెప్పినట్లు వీరశివా వెల్లడించారు.