రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు.

కోటగిరి సెప్టెంబర్ 14 జనం సాక్షి:-హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో కలిసి 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సం.లలోకి అడిగీడుతున్న సందర్భంగా ఏడాది పాటుగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి వర్గ తీర్మానించి విషయం అందరికీ తెలిసిన విషయమే.ఈ వజ్రోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా మంగళవారం నాడు కోటగిరి మండల ఎంపిడిఓ కార్యాలయంలో మండల అధికారి,ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు.ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్ మాట్లాడుతూ.తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ప్రారంభ వేడుకలు ఈ నెల 16,17,18 తేదీలలో నిర్వహించుకోవడం శుభ పరిణామమని కొనియాడారు.ఈ వేడుకలు వచ్చే సం.ఇవే తేదీలలో ఘనంగా ముగుస్తాయనీ పేర్కొన్నారు.ఈ వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా ఈ నెల 16 న బాన్సువాడ నియోజక వర్గం కేంద్రంగా స్పీకర్ సమక్షంలో నిర్వహిస్తున్న వజ్రోత్సవ ర్యాలీలో కోటగిరి మండలం నుంచి ప్రజలు,యువతీ, యువకులు,మహి ళలు అధికసంఖ్యలో పాల్గొనలని కోరారు.అలాగే 17 వ తేదీన హైదరాబాద్లో సీఎం కెసిఆర్ సమక్షంలో నిర్వహించే జాతీయ పతాకావిష్కరణ,భారీ బహిరంగ ర్యాలీలు,బంజారా భావన ప్రారంభం, సీఎం కెసిఆర్ భారీ ప్రసంగాలలో కోటగిరి మండలం నుంచి ప్రజా ప్రతినిధులు,బంజారా సోదరులు అధికసంఖ్యలో తరలి వెళ్లాలన్నారు. అదేవిధంగా18 న స్వాతంత్ర సమరయోధులు, కవులు,కళాకారులను ఘనంగా సన్మానించుకోడం జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో యం.అర్.ఓ శ్రీకాంత్ రావ్,ఎంపిడిఓ మారుతి, ఎస్.ఐ రాము,మండల సర్పంచ్లు,ఎంపీటీసీ, అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.