రికార్డు సృష్టించిన ఉసేన్ బోల్ట్

image-17జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ చరిత్ర సృష్టించాడు.రియో ఒలింపిక్స్ లో మూడు స్వర్ణాలు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటికే 100, 200 మీటర్ల పరుగులో గోల్డ్ సాధించిన బోల్ట్.. 400 మీటర్ల రిలేలోనూ స్వర్ణం సాధించాడు. 37.27 సెకన్లలోనే జమైకన్ రిలే టీమ్ టార్గెట్ ను కంప్లీట్ చేసి స్వర్ణాన్ని కొల్లగొట్టింది. జపాన్ టీమ్ సిల్వర్, కెనడా టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించింది. రియోలో మూడు స్వర్ణాలు సాధించిన బోల్ట్.. కెరీర్ లో 9 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ తో చరిత్ర సృష్టించాడు.

వెనకబడ్డారో… తాట తీస్తా: బోల్ట్

రియో ట్రాక్ అండ్ ఫీల్డ్  మెయిన్ స్టేడియం….చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ఉన్న సమయంలో బోల్ట్ గ్రీన్ రూమ్ లో తన సహచరులందరినీ పిలిచాడు.. ఎనిమిదేళ్ళుగా తాను పడ్డ కష్టాన్ని, సాధించిన రికార్డుల్ని ఏకరువు పెట్టాడు. ఇక ఒలింపిక్స్ లో ఆఖరి పరుగుపందెంలో దిగుతున్నానని, 4×100 మీటర్ల రిలేలో తనను గెలిపించే బాధ్యత మీ అందరిదీనన్నాడు. అందరిలో మౌనం.. “ఏంటలా మాట్లాడకుండా ఉన్నారు.. ఇది జీవన్మరణ పోరాటం.. మీరు గనక వెనకబడ్డారో ఒక్కొక్కడి తాట తీస్తాను.. జాగ్రత్త” అని హెచ్చరించాడు.. కాస్త నవ్వుతూనే బోల్డ్ ఆ మాట అన్నప్పటికీ అతని సహచరులు సీరియస్ గానే తీసుకున్నారు. పిస్టల్ శబ్దం వెలువడగానే దూకుడుగా పరిగెట్టారు.37.27 సెకన్లలోనే గమ్యం చేరి స్వర్ణం సాధించారు.. బోల్ట్ కల నెరవేర్చారు.. వారందరినీ కౌగిలించుకుని, జమైకన్ తరహా థాంక్స్ చెప్పాడు బోల్ట్..
రేపటితో (ఆదివారంతో) బోల్ట్ కు 34 ఏళ్ళు. మూడు ఒలింపిక్స్ లో మూడేసి స్వర్ణాలు సాధించి శిఖరంపై నిలిచిన బోల్ట్ కు నిజంగా ఇది గొప్ప కానుక అనే చెప్పాలి. నేనే వరల్ట్ లో గ్రేటెస్ట్ అని గర్వంగా ప్రకటించుకున్న ఈ చిరుతపులి పేరు ఒలింపిక్స్ ఉన్నంతకాలం, ట్రాక్ అండ్ పీల్డ్ ఈవెంట్లున్నంత కాలం మార్మోగుతూనే ఉంటుంది. “ నిజంగా చాలా ఒత్తిడి ఫీలయ్యాను.. అయితే ఈ క్షణాల్ని చాలా ఎంజాయ్ చేసాను.. చాలా అద్భుతమైన క్షణాలివి.. నేను గెలిచాను అనే కంటే సాధించాననడం సరిగా ఉంటుంది.. ఈ రాత్రి పొద్దుపోయేదాకా మేల్కొని ఎంజాయ్ చేస్తాను.. నన్ను చూసి నాకే గర్వంగా ఉంది మరి..!” అని బోల్ట్ చెప్పాడు.