రియోలో మహిళల హాకీ టీమ్ ఓటమి

రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల జట్టు విఫలమైంది. బ్రిటన్‌పై 0-3 తేడాతో పరాజయం పాలైంది. మొదటి క్వార్టర్‌లో 0-0తో నిలిచిన భారత్‌ రెండో క్వార్టర్‌లో బ్రిటన్‌కు రెండు పెనాల్టీ షూటౌట్‌లను ఇవ్వడంతో ఆ జట్టు 2-0తో అధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లోనూ భారత డిఫెన్స్‌ విఫలమవ్వడంతో మరో గోల్‌ను సమర్పించుకుంది. నాలుగో క్వార్టర్‌లో భారత్‌కు ఓ పెనాల్టీ షూటౌట్‌ అవకాశం వచ్చినా గోల్‌గా మలచడంలో భారత్‌ విఫలమైంది. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.