రుద్రంగి మండల ఎస్సై గా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి)
రుద్రంగి మండల నూతన ఎస్సైగా ఎం.ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు.ప్రభాకర్ గతంలో కరీంనగర్ టు టౌన్ ఎస్సైగా విధులు నిర్వహించారు.ఇంతకుముందు ఇక్కడ
విధులు నిర్వహించిన ఎస్సై విజయ్ వరంగల్ కమిషనర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు.
నూతన ఎస్సై ప్రభాకర్ మాట్లాడుతూ…మండలంలో శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తే సహించబోమని అన్నారు.ముఖ్యంగా యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సుంచించారు..అలాగే ప్రజలు ఎటువంటి ఫిర్యాదులు చేయడానికైనా నేరుగా పోలీస్టేషన్ కి వచ్చి పిర్యాదు చేయాలని కోరారు.మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని ప్రజలు సహకరించాలని కోరారు.