రూరల్ పోలీస్ స్టేషన్లు తనిఖీ చేసిన డిఐజి
కడప,ఆగస్టు29(జనం సాక్షి): కర్నూలు రేంజ్ డిఐజి శ్రీనివాసరావు బుధవారం మైదుకూరు అర్బన్ రూరల్ పోలీస్‌స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్లలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మైదుకూరు పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాలని, పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి స్కూళ్లు, కళాశాలల ఎదుట ట్రాఫిక్ బోర్డులను ఏర్పాటు చేయాలని డిఎస్పీ శ్రీనివాసులుకు ఆదేశించారు. ట్రాఫిక్‌ను కట్టడి చేయాలని, స్కూల్ బస్సులు రాంగ్ రూట్‌లో ప్రయాణించకుండా చూడాలని పోలీసులకు ఆదేశించారు. కార్యక్రమంలో అర్బన్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రాజేంద్ర యాదవ్ , రూరల్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ హనుమంతనాయక్, ఎస్‌ఐలు రామకఅష్ణ, హాజీవల్లి, సుబ్బారావు, సహదేవ్ లు పాల్గొన్నారు.