రూ. 50కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.

తాండూరులో మంత్రుల పర్యటనను విజయవంతం చేద్దాం.
పట్టణ అద్యక్షులు నయీం అఫు.
తాండూరు సెప్టెంబర్ 26( జనం సాక్షి)రేపు తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆద్వర్యంలో పెద్దఎతున్న రూ. 50కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథు లుగా రాష్ట్ర మంత్రులు ఆర్ధిక,వైద్య ఆరోగ్యశాఖ
మంత్రి తన్నీరు హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి
పట్లోళ్ల సబితాఇంద్ర రెడ్డి,సమాచార పౌర సంబంధాల,భూగర్భాగనుల శాఖ మంత్రి
మహేందర్ రెడ్డి పాల్గొనన్నున్నారని పట్టణ అద్యక్షులు నయీం అఫు తెలిపారు.ఈ సందర్భంగా రూ.10.23కోట్లతో జినుగుర్తి, కందనెల్లి, చంద్రవంచ, జుంటుపల్లి పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణంకు శంకుస్థాపన చేయానున్నారని.రూ. 25కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజ్. రూ.10 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధి పనులు.రూ. 1.50కోటితో తాండూరు లైబ్రరీ నూతన భవనానికి శంకుస్థాపన.పట్టంలోని శాంతినగర్ లోని ఈ-సేవా భవనంలోని ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ ను ప్రారంభించడం జరుగుతుందని. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనన్నున్నారు.అనంతరం పట్టణంలోని విలియమూన్ మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని. కావున మంత్రుల పర్యటను విజయవంతం చెయ్యాలని పట్టన అద్యక్షులు నయీం అఫ్ఫు పేర్కొన్నారు.