రెండు మండలాల సోషల్ మీడియా ఇంచార్జిగా వెంకటేశ్వర్లు

 

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్2(జనంసాక్షి)

మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం రెండు మండలాల తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా ఇంచార్జిగా గార్ల మండలానికి చెందిన వల్లపుదాసు వెంకటేశ్వర్లును నీయమిస్తూ ఇల్లందు నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు బాణోత్ హరిప్రియ ఉత్తర్వులు జారీచేశారు. తన బాధ్యతను నిజాయితీ,నిబద్ధతతో పార్టీ కార్యక్రమాలలో పలుపంచుకుని పార్టీ అభివృద్ధికి దోహదపడుతూ, పార్టీ ప్రజలకోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధికి శ్రమించాలని సూచించారు. తనకు అప్పగించిన బాధ్యతలు తప్పక నిర్వహిస్తానని అనునిత్యం పార్టీ అభివృద్ధికి శ్రామిస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు. తన పదవికి సహకరించిన నాయకులకు ఋణపడి ఉంటానని అన్నారు.