రెండు లారీలు ఢీకొని డ్రైవర్ మృతి
మరొకరికి తీవ్ర గాయాలు
ఎన్టీఆర్,ఆగస్ట్2(జనంసాక్షి): జిల్లాలోని తిరువూరు గ్యాస్ కంపెనీ సవిూపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయరహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లలో డ్రైవర్లు ఇరుక్కుపోయారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి డ్రైవర్లను బయటకు తీశారు. ఒక లారీ డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయరహదారిపై ట్రాఫిక్‌జామ్ అయింది. దాంతో భారీగా రాకపోకలు నిలిచిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.