రెండోరోజు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్
ధరలు, జిఎస్టీపై చర్చకు విపక్షాల పట్టు
ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా
న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి
):ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వరుసగా రెండోరోజూ వాయిద పర్వం సాగింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ధరల పెంపు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉభయ సభలను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు ధరల పెంపుపై ఆందోళన చేపట్టాయి. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లగా.. ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభను మంగళవారానికి వాయిదా వేశారు. విపక్ష సభ్యుల ఆందోళనతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటకు వాయిదా పడిరది. లోక్ సభ ప్రారంభం అయిన కాసేపటికే ప్రతిపక్ష ఎంపీలు ధరల పెరుగుదలపై భగ్గమన్నారు. జీఎస్టీ, నిత్యావసర ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి ప్రవేశించి ఆందోళనను మరింత ఉదృతం చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. స్పీకర్ ఓ బిర్లా విపక్ష సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం
చేసినా..వారు నిరసనలను మానుకోలేదు. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ధరల పెరుగుదల, జీఎస్టీపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. ద్రవ్యోల్భణం, గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు.ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ ఓం బిర్లా ముఖానికి అడ్డంగా ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. విపక్ష సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా గౌరవాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అంశంపై చర్చకు సిద్దమన్నారు. సభ నిబంధనలకు విరుద్దంగా ప్లకార్డులు ప్రదర్శించడం సరికాదన్నారు. ఈ క్రమంలో సభను వాయిదా వేశారు.