రెయిన్ పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్, జనంసాక్షి: రెయిన్ పబ్ నిర్వాహకులపై పోలిసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి కూడా రెయిన్ పబ్ తెరచి ఉండటంపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారిన ఈ పబ్‌తో పాటు, పబ్ నిర్వాహకుల ఆగడాలు కూడా శృతి మించుతున్నాయి.
గత అర్ధరాత్రి పబ్‌లో తప్పతాగిన యువతీ, యువకులు వీరంగం సృషించటంతో పాటు దారిన వెళుతున్న వారిపై దాడికి యత్నించారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేసేందుకు ప్రయత్నించటమే కాకుండా బూతు పురాణం లంఖించుకున్న విషయం తెలిసిందే.