రెవెన్యూ రికార్డుల శుద్దీకరణ చేపట్టాలి

  • జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌

జగిత్యాల, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల శుద్దీకరణ చేపట్టి భూములకు సంబందించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ పేర్కొన్నారు. శుక్రవారం

రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో తహశీల్దార్ల సమావేశంలో తహశీల్దార్‌లతో సవిూక్ష నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పట్టా భూములు అసైన్డ్‌ భూములు ఇతర భూమి ఎంత ఉందో తెలుసుకుని వాటి వివరాలను సమగ్రంగా రికార్డులు నిర్వహించుటకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రభుత్వం సేరరించిన భూమి వివరాలు రికార్డులలో నమోదుకావడం లేదని అలాగే గ్రమాల్లో ఉన్న భూముల వివరాలను మ్యాపులు తయారు చేయించాలన్నారు ఇందుకు గ్రామానికి మూడు టీంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బూములను మూడు కేటగిరీలుగా విభజించాలన్నారు. సర్వేయర్ల కోరత ఉన్నదగ్గర అనుభవం ఉన్నవారిని వినియోగించుకోవాలని ప్రతి పది రోజులకు ఒక గ్రామం చోప్పున పూర్తి చేయాలన్నారు, ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది రికార్డులలో నమోదు చేయాలని రికార్డుల ప్రకారం భూమి ఉండాలన్నారు. వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ సమన్వయంతో పనిచేయాలని పహానిలో ప్రతి సర్వే నంబర్‌ వివరాలు నమోదు చేయాలన్నారు. రెవెన్యూ గ్రామాల వివరాలు షెడ్యూల్‌ తయారు చేసి గ్రామసభలు నిర్వహించే తేదీలను నిర్ణయించి రైతు సమన్వయ సమితిలకు తెలుపాలన్నారున ప్రతి రెవెన్యూ గ్రామానికి 5 వేల రూపాయల మంజూరు చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో శుద్దీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ముషార్రఫ్‌ ఫారూఖి డీఆర్‌ఓ శ్యాంప్రకాశ్‌ ఆర్డీఓ నరెందర్‌ తదితరులు పాల్గొన్నారు.