రేజింతల్‌లో చిరుతపులి కలకలం

సంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని రేజీంతల్‌లో పులి సంచారం కలకలం రేపింది. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కుందేళ్ల లక్ష్మయ్య అనే రైతు పొలానికి వెళ్తుండగా చిరుతపులి కనిపింది. దీంతో భయాందోళనకు గురైన అతడు మళ్లీ గ్రామానికి చేరుకున్నారు. విషయాన్ని అటవీ అధికారులకు అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న అధికారులు.. ఆ ప్రాంతంలో కాలి ముద్రలను పరిశీలించారు. కాగా, అది చిరుత లేదా మరేదైనా జంతువా అనే విషయాన్ని నిర్దారిస్తామని ఫారెస్ట్‌ అధికారి విజయరాణి పేర్కొన్నారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.