రేపు కేసీఆర్‌ను కలువనున్న కోదండరాం
హైదరాబాద: టీఆర్ఎస్ – తెలంగాణ రాజకీయ జేఏసీ మధ్య ఏర్పడిన వివాదాలు పటాపంచలు కానున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ రథసారథి కే చంద్రశేఖర్‌రావును తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కలువనున్నారు. ఇరువురి మధ్య ఏర్పడిన పొరపొచ్చాల గురించి వారు ప్రధానంగా చర్చించనున్నాట్టు సమాచారం.