రైతుకు బేడీలేస్తారా?
` విచారణ జరిపించి నివేదిక ఇవ్వండి..
` హీర్యానాయక్ ఘటనపై సీఎం సీరియస్
` గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన రైతుకు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తున్న వైద్యులు
హైదరాబాద్(జనంసాక్షి): లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్‌కు సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతీనొప్పి వచ్చింది. జైలు నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా రైతు హీర్యానాయక్‌కు బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు.రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడిన సీఎం.. ఘటనపై ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు. హీర్యా నాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.ఛాతీనొప్పి రావడంతో రైతు హీర్యానాయక్‌కు మొదట సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం హీర్యానాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని సంగారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తెలిపారు. హార్ట్ బీట్ కొంచెం తక్కువగా ఉందని, గతంలో కూడా గుండె నొప్పి వచ్చిందని చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట నిమ్స్‌కు రిఫర్ చేశామని చెప్పారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో రైతుకు చికిత్స అందిస్తున్నారు.కాగా రైతు హీర్యానాయక్‌కు గుండెనొప్పి వస్తే బేడీలు వేసి జైలు నుంచి ఆసుపత్రికి తరలించడం క్షమార్హం కాదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. అంబులెన్స్‌లో తీసుకురావాల్సిన వ్యక్తిని బేడీలు వేసి తీసుకురావడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. రైతులను కస్టడీలో చిత్రహింసలు పెట్టారని మేజిస్ట్రేట్ ముందు చెబితే.. కుటుంబ సభ్యులను కూడా కొడతామని బెదిరించారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట వినకపోవడమే వారు చేసిన తప్పా? అని నిలదీశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేశారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రైతు హీర్యానాయక్ ఉగ్రవాదా? దోపిడీ దొంగా? అని ప్రశ్నించారు. రైతుల భూములు లాక్కుంటారు.. తిరగబడితే అరెస్టులు చేస్తారని ఆరోపించారు. మరోవైపు హీర్యానాయక్‌కు మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి నుంచి గాంధీకి అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్‌హాస్పిటల్ డైరెక్టర్ బీరప్ప స్పందించారు. పేషెంట్ కండిషన్ నిలకడగా ఉందని తెలిపారు. అన్ని రకాల వైద్యపరీక్షలు చేశామని, అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని వెల్లడిరచారు. సీఎం ఆఫీస్‌నుంచి మెరుగైన వైద్యం అందించాలని స్పెషల్‌ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయని ఆయన తెలిపారు. జనరల్ ఫిజీషియన్స్ డాక్టర్,కార్డియాలజీ వైద్యులతో పేషెంట్‌కు చికిత్స అందిస్తున్నామని వివరించారు. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వెనక్కి తీసుకున్న సర్కార్, రైతుల పైనా పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు తమ బిడ్డకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హీర్యానాయక్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీఆర్?ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు? స్పందించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..? అని నిలదీశారు. రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా ఎలా వ్యవహరిస్తారని ఆక్షేపించారు.మరోవైపు ఈ ఘటనపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా స్పందించారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్ కు గుండెనొప్పి వస్తే బేడీలు వేసి జైలు నుంచి ఆసుపత్రికి తరలించడం క్షమార్హం కాదని కేటీఆర్ మండిపడ్డారు. అంబులెన్స్ లో తీసుకురావాల్సిన వ్యక్తిని బేడీలు వేసుకొని తీసుకొని రావడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు.కాగా లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న హీర్యానాయక్‌ను సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షలు చేసే సమయంలో ఛాతినొప్పి వచ్చింది. దీంతో అతడిని? మొదట సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్?లో చికిత్సను అందించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ హీర్యానాయకు గుండెపోటు రావడంతో పంజాగుట్ట నిమ్స్‌కు తరలించారు.