రైతుకూలీలతో కలిసి వరినాట్లు వేసిన జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

టేకులపల్లి, ఆగస్టు 20( జనం సాక్షి ): రైతు కూలీలతో కలిసి తలపాగా చుట్టి వరి నారు మోసుకుంటూ కూలీలతో సందడిగా వెళుతూ బురద పొలంలోకి దిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య వరి నాటు వేసి అందరినీ ఆనందపరిచారు. భారత స్వాతంత్ర్య 75వ వజ్రోత్సవ వేడుకల లో భాగంగా శనివారం  టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయతీలో తెరాసా నాయకులు ఈది గణేష్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 75వ సిల్వర్ జూబ్లీ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై కోరం కనకయ్య స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ దమ్ముచేసి,కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. ఈసందర్భంగా ఆయన రైతుకూలీలతో  ముచ్చటిస్తూ,రాష్రంలో 24 గంటల నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుభీమా,గిట్టుబాటు ధర,ఒంటరి మహిళా ఆసరా పింఛన్,కళ్యాణ లక్ష్మీ, షాధీ ముబారక్,లాంటి అభివృద్హి సంక్షేమ పథకాలు చేపట్టిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ కి రైతు సోదరులంతా అనునిత్యం అండగా ఉండాలన్నారు. అనంతరం రైతు కూలీలకు స్వయంగా మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యదల్లపల్లి బాబు,వార్డ్ మెంబర్ అజ్మీరా మంగ,సొసైటీ మాజీ ఛైర్మన్ పుణ్యా నాయక్,అజ్మీరా వీరన్న,రేఖా పూర్ణ చందర్ రావు,రేఖా శివాజీ,బోడా మంగీలాల్ నాయక్, గడ్డం మధు రెడ్డి,నూకల వెంకన్న, కుర్రా అనీల్,మడ్డి వీరేంద్రమ్,కంబాల మధు,గండ రమేష్,రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.