రైతుపై ఎలుగుబంటి దాడి

కరీంనగర్: పొలం వద్దకు వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో జరిగిన ఈ దాడిలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.