.రైతురాజ్యం రావాలి


` భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు టికాయత్‌తో సీఎం కేసీఆర్‌ భేటి
` కేసీఆర్‌ను కలిసిన బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి
న్యూఢల్లీి,మార్చి 4(జనంసాక్షి): ఢల్లీి పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకులు రాకేశ్‌ తికాయత్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్‌ రాజకీయాలపై చర్చించారు. కేసీఆర్‌తో కలిసి సుబ్రమణియన్‌ స్వామి, రాకేశ్‌ తికాయత్‌ లంచ్‌ చేశారు. వారితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌ కుమార్‌, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఇటీవలే మహారాష్ట్రలో పర్యటించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరేతో పాటు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో కేసీఆర్‌ సమావేశమై జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పాలనపై ప్రాంతీయ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వాన్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీల నేతలు, పౌర సమాజ సభ్యలు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు ఉమ్మడి వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్‌. ఈ లక్ష్యాలను సాధించే దిశగా అన్ని పార్టీల, వివిధ ప్రజా సంఘాల నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశమవుతున్నారు. ఈక్రమంలో గురువారం ఢల్లీిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ బీజేపీ ఉప్పు నిప్పులా మండి పోతుంటే ఢల్లీిలో మాత్రం సీఎం కేసీఆర్‌ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కలుసుకున్నారు. ఇటు సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అలాగే స్వపార్టీ విూదనే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్రాన్ని అనేక అంశాల్లో వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీగా ఏప్రిల్‌ 24తో సుబ్రమణ్య స్వామి పదవీ కాలం ముగుస్తుంది. ఈ క్రమంలో కేంద్రాన్ని వ్యతిరేకించే సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీ కావటంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి కేసీఆర్‌ తో భేటీ కావటం మరింత ప్రాధాన్యతకు సంతరించుకుంది. భేటీ కేసీఆర్‌ ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తో పాటు బికేయు రైతు సంఘం నేత రాకేష్‌ టికాయత్‌ సహా పలువురు పలువురు జాతీయ నేతలు కలిశారు. ఢల్లీిలోని తుగ్లక్‌ రోడ్‌ 23 లో ఉన్న కేసీఆర్‌ నివాసంలో కేసీఆర్‌ ను వీరు సమావేశమయ్యారు.